• Login / Register
  • Andhra Pradesh | ఏపీలో 16వేల ఉద్యోగాల భర్తీ

    Andhra Pradesh | ఏపీలో 16వేల ఉద్యోగాల భర్తీ
    ఏపీ అసెంబ్లీలో ఏపీ కీలక ప్రకటన
    త్వ‌ర‌లోనే 16 వేల టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం డిఎస్సీ విడుద‌ల‌
    ఏపీ అసెంబ్లీల‌లో ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌
    Hyderabad : ఏపీలోని నిరుద్యోగ యువతకు16 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్న‌ట్లు  ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు అధికారిక ప్రకటన చేశారు. 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఏప‌ చరిత్రలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 డీఎస్సీలు ప్రకటించి.. ఒకటిన్నర లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ఈ సంద‌ర్బంగా  మంత్రి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు హయాంలోనే 9 డీఎస్సీలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఏపీలో నిరుద్యోగ యువత తరుఫున పోరాటం వ‌ల్లే ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 93 శాతం విజయాన్ని కట్టబెట్టారన్న నారా లోకేష్..  ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుద‌ల చేస్తామని ప్ర‌క‌టించారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలనే ల‌క్ష్యంతో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు భ‌ర్తీ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఉద్యోగాల కల్పనకు నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీకి తనను ఛైర్మన్‌ను చేశార‌ని మంత్రి పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు  అసెంబ్లీలో మంత్రి వివరించారు. 
    *  *  *

    Leave A Comment